యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రతినిధులు మిస్సెస్ లూయిస్,రిచర్డ్ మెక్డోనాల్డ్,నేషనల్ హెల్త్ సర్వీస్ ఇండియా ప్రతినిధి రాధ రెడ్డి లు శుక్రవారం కడపలోని నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ సంస్థకి పర్యవేక్షిచారు. ఇందులో శిక్షణ పొందుతున్న ట్రైనీస్, ఎమర్జెన్సీ మెడికల్ టేక్నిషియన్ లకు పలు అదునాతన మెలుకువలు నేర్పిస్తున్నారని ఈసందర్భంగా అన్నారు.ఈ కోర్సులకు రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కుగా ఉంటాయని పేర్కొంటూ ఇక్కడ జరుగుతున్న ట్రైనింగ్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటువంటి కోర్సులను మరింతగా పోత్సహించాలని సంస్థ యాజమాన్ని కోరారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డిడియుజి కేవై పథకం సీడప్ సౌజన్యంతో నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ శిక్షణ సంస్థలో వారు ఇటువంటి కోర్సులను ప్రోత్సాహిన్స్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది, అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ప్రతినిధి పరశురాం ,మహిపాల్, ఈశ్వర్ ,నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ , వారి సిబ్బంది పాల్గొన్నారు